లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు రెండవ సెషన్లో కెఎల్ రాహుల్ భారత్ తరపున తన తొమ్మిదవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ మరో ఎండ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 130 బంతుల్లో తన […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ వద్ద ఆధారలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లేదని గుర్తించారు. ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. డబ్బుల తరలింపు పై టాస్క్‌పోర్స్ టీమ్ కు ప్రణీత్ రావు సమాచారం […]
తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ సజ్జనార్ సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు. Also Read:Mani Ratnam: […]
లంచం తీసుకోవడం నేరం అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కావొచ్చేమో కొందరు ఉద్యోగులు లంచాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు రావడం లేదు. తాజాగా జిహెచ్ఎంసి గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. ఆమెనే అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. Also Read:12 Marriages: నిత్య పెళ్లి కూతురు..! […]
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. తాజగా నార్సింగ్ లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. రూ. 30 లక్షల విలువైన ఎస్టసీ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ తో పాటు.. ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. మణికొండ లో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా […]
వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని […]
ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయినట్లు పోలీసులు తెలిపారు. 5 వ సారి సక్సెస్ అయ్యింది సుపారీ బ్యాచ్. మాస్టర్ మైండ్ అంతా తిరుమల రావుది అని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ టీమ్ తేజేశ్వర్ ను చేను సర్వే చేయాలని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు తేజేశ్వర్. గద్వాల మండలం వీరాపురం స్టేజి […]
నిజమాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెంటఖుర్డు గ్రామంలో దారుణం వెలుగుచూసింది. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కసాయిలా మారాడు. కన్నతల్లి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మత్తులో తల్లిని గొడ్డలితో నరికాడు చిన్న కొడుకు సురేశ్. తల్లిని హతమార్చిన అనంతరం నగలు ఎత్తుకెళ్లాడు. సుమారు 50 తులాల వెండి ఆభరణాలు అపహరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు […]
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నిల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. Also Read:OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం […]
ఓ మహిళ చనిపోయినట్లు భావించిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. నెల రోజుల తర్వాత అకస్మాత్తుగా ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ మహిళ సజీవంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విషాదం నెలకొన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్ప నయా బస్తీ నివాసి రామ్ స్వరూప్ రాయ్ భార్య రమా దేవి (45) మే 17న అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ […]