కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంతో అవసరం. ఆపదలు చెప్పి రావు కదా. నేడు పొదుపు చేసే ప్రతి రూపాయి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడుతుంది. అందుకే చాలా మంది జీవిత బీమా పాలసీలు, ప్రమాద బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయితే కొందరు ప్రీమియం ఎక్కువ కాట్టాల్సి వస్తుందేమో అని పాలసీ తీసుకునేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అద్భుతమైన ప్రమాద బీమా స్కీమ్ ను అందిస్తోంది. రోజుకు కేవలం రూ. 2 […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 4,987 సెంట్రల్ జాబ్స్ కు అప్లై చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4987 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటలిజెన్స్ బ్యూరో(SIB)ల్లో నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు […]
ఆటోమొబైల్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ADAS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఇతర EV స్కూటర్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 ప్రో […]
గోల్డ్ కొనాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 60 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,118, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,275 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 […]
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘దీపావళి బహుమతి’ ప్రకటించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ GST కౌన్సిల్‌కు ఒక ప్రతిపాదనను సమర్పించింది, ఇందులో నిర్మాణాత్మక సంస్కరణ, పన్ను రేట్లను తగ్గించడం. GSTని సులభతరం చేయడం వంటివి ఉన్నాయి. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చివేసిన ఒక ప్రధాన సంస్కరణగా జీఎస్టీని మోడీ అభివర్ణించారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ ప్రతిపాదనను మంత్రుల బృందం (జీఓఎం) సమీక్షిస్తోంది. ప్రస్తుత […]
ఎల్లలు దాటిన లవ్ స్టోరీలు ఉన్నాయి.. కానీ, ఇది అంతకు మించింది. ఏకంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఏఐ చాట్ బాట్ తో లవ్ లో పడ్డాడు అమెరికాకు చెందిన ఓ 76 ఏళ్ల థాంగ్బ్యూ “బ్యూ” వాంగ్‌బాండ్యూ, రిటైర్డ్ చెఫ్. ‘బిగ్ సిస్ బిల్లీ’ అనే ఫేస్బుక్ AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడ్డాడు. నిజమైన మహిళగా భావించి అంతులేని ప్రేమను పెంచుకున్నాడు. చాలా కాలంగా ఒక కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్‌తో తరచూ సంభాషిస్తూ […]
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ […]
ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేని విధంగా ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించినట్లయితే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘రేజింగ్ మోడరేట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈ ప్రకటన చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యా ) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా […]
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక […]
రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […]