బెంగళూరుకు చెందిన ఈవీ కంపెనీ సెల్ఫ్-మేడ్ బ్యాటరీతో కూడిన దాని S1 ప్రో+ 5.2 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ స్కూటర్ కంపెనీ స్వంతంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ అధిక రేంజ్ ను అందించడమే కాకుండా మెరుగైన భద్రత, పనితీరును కూడా అందిస్తుంది. ఇటీవల, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన AIS-156 సవరణ 4 ప్రమాణాల ప్రకారం దాని సెల్ఫ్-మేడ్ 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్ (5.2 kWh కాన్ఫిగరేషన్‌లో) ARAI సర్టిఫికేషన్ పొందిందని కంపెనీ ప్రకటించింది.
Also Read:BJP Leader: ‘‘ఖాన్’’ను ముంబై మేయర్‌గా అనుమతించం..మమ్దానీ గెలుపు తర్వాత బీజేపీ లీడర్ కామెంట్స్..
S1 Pro+ 5.2kWh స్కూటర్ శక్తివంతమైన 13 kW మోటారుతో శక్తినిస్తుంది. ఇది కేవలం 2.1 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఇది 320 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో. ఇందులో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ABS, సౌకర్యవంతమైన డ్యూయల్-టోన్ సీటు, బాడీ-కలర్ మిర్రర్లు, కొత్త డై-కాస్ట్ అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్, రిమ్ డెకాల్స్‌తో పాటు వివిధ రకాల ఆకర్షణీయమైన
కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. S1 Pro+ 5.2kWh మోడల్ ధర రూ. 1,90,338 (ఎక్స్-షోరూమ్).