సైబర్ సిటీలోని యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వెలుపల బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు రెండు డజన్లకు పైగా బుల్లెట్లను పేల్చారు. కాల్పుల ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. సమాచారం ప్రకారం, ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటి వెలుపల కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో ఉన్న ఇంటి వద్ద ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో […]
సాగునీటిపై హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతుంది.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తుంది.. నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు.. […]
పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం, ఒక ప్యాసింజర్ రైలులోని 4 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో, ఒక ప్రయాణీకుడు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ రైలు పెషావర్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Also […]
మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఏపీ చిలకలూరిపేట కి చెందిన లక్ష్మీ రెడ్డి పై 2024 లో ముంబై లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీ రెడ్డి.. కొడుకు నరేందర్ రెడ్డి, కూతురు తో కలిసి మరో దందాకు తెరలేపింది. మాదాపూర్, అమీర్‌పేట, RTC x రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు ఏర్పర్చుకుంది. అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు […]
ఈజీగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ. 20 కోట్లు కాజేశాడు ఓ ఘనుడు. అతడే మల్కాజిగిరి కి చెందిన దినేష్ పాణ్యం. వృద్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా భారీ మోసానికి తెరలేపాడు. ఆఖరికి రూ. 20 కోట్లు కాజేసి పరారయ్యాడు. పూర్తివివరాల్లోకి వెళ్తే.. దినేష్ పాణ్యం మల్కాజిగిరి అడ్డాగా ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. షేర్ […]
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వాజేడు బొగత జలపాతం పర్యాటకుల సందర్శన నిలిపివేశారు అధికారులు. గత రెండు రోజులుగా పెనుగోలు గుట్టల పై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శన నిలిపివేసిన అధికారులు. అదేవిధంగా రానున్న రెండు రోజులలో వాతావరణ శాఖ […]
నేడు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇండీ డాగ్ అడప్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర ప్రజలను అందమైన వీధి కుక్కపిల్లలకు ప్రేమ, ఇల్లు ఇవ్వడానికి ప్రోత్సహించడానికి ఇండీ డాగ్ కుక్కపిల్లల అడాప్షన్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2025 ఆగస్టు 17 (ఆదివారం) ఉదయం 6:00 నుండి ఉదయం 10:00 గంటల వరకు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 1లోని జలగం వెంగళ్ రావు పార్క్‌లో జరుగనున్నది. Also Read:EC Press Meet: […]
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భార్యను హత్య చేసినందుకు బిజెపి నాయకుడు అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన ఆగస్టు 10న జరిగింది. ఎవరో దుండగులు హత్య చేశారని చిత్రీకరించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు దానిని భర్తే హత్య చేశాడని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజెపి నాయకుడు రోహిత్ సైని తన ప్రియురాలు రీతు సైని కోరిక మేరకు తన భార్య సంజును హత్య చేశాడు. మొదట్లో, కొంతమంది గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి, సంజును హత్య చేసి, […]
అంతరిక్షంలో భారత జెండాను ఎగురవేసిన భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి ఆయన విమానం ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో శాస్త్రవేత్తలు, విద్యార్థుల బృందం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుభాంషు భార్య కామ్నా శుక్లా, కుమారుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు. Also Read:Off The […]
దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ కు భక్తులు పోటెత్తారు. చిన్న పిల్లలు శ్రీకృష్ణుడి,గోపిక వేషాధారణలో మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. భక్తులు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ కృష్ణుడు, రాధా విలువైన ఆభరణాలతో అలంకరించబడ్డారు. రాధా-కృష్ణుల విగ్రహంలో కనిపించే ఆభరణాలు కోట్ల విలువైనవి. బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన.. రూ. […]