Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి తన మైండ్‌లో ఎక్కడో ఒకచోట ఉన్న మాట నిజమేనని, కానీ కోచ్‌లు మాత్రం తను ప్రాక్టీస్‌లో ఏం చేశాడో ఇక్కడ కూడా అదే అమలు చేయమన్నారని వైభవ్ […] -
Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్, పవర్‌ప్లే నుంచే పరుగుల వరద పారించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత అరుదైన సరికొత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 […] -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై చెలరేగిపోయాడు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్, కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల […] -
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరుగుతున్న ఈ చావో రేవో పోరులో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 6 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 80 […] -
SRH Vs RR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ చావో రేవో పోరులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చేజింగ్‌కు అనుకూలంగా ఉండటం, గత కొన్ని మ్యాచ్‌లుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుండటంతో […] -
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విశ్వరూపానికి వేదికగా నిలిచింది. లీగ్ దశలో రికార్డు స్థాయిలో 9.85 రన్ రేట్ నమోదు కావడం, 220కి పైగా పరుగుల లక్ష్యాలను జట్లు ఏకంగా తొమ్మిది సార్లు ఛేదించడం ఈ సీజన్ తీవ్రతను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి దక్కే ‘ఆరెంజ్ క్యాప్’ రేసు ప్లేఆఫ్స్ వేళ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ […] -
Supreme Court: VVPAT స్లిప్పులపై ‘టైమ్ స్టాంప్’.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. ఏమన్నారంటే..
ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు, ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) స్లిప్పులపై ఓటు రికార్డైన కచ్చితమైన సమయాన్ని ముద్రించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం పరిష్కరించింది. ఈ అంశం పూర్తిగా సాంకేతికపరమైనదని, కాబట్టి దీనిపై భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడమే సమంజసమని కోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా , జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వ్యాపారవేత్త అయిన నల్లా […] -
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ‘సూపర్ స్ప్లెండర్’ సిరీస్, 1990ల నాటి నుంచి నేటికీ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఈ ఐకానిక్ బైక్‌ను మరింత ఆధునీకరిస్తూ, హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ XTEC 2.0’ మోడల్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, యువతను […] -
Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ […] -
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, […]
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!