Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
- ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్..
- నవంబర్ 26న రాష్ట్రాల రాజధానుల్లో ‘‘సంవిధాన్ రక్షా మార్చ్’’కు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ కార్యక్రమాన్ని మరో తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 26న దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో INDIA కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ వేదికగా భారీ ర్యాలీ నిర్వహించింది. దీని తర్వాత తలపెట్టిన ఛలో ఢిల్లీ ప్రోగ్రాంను పార్టీ వాయిదా వేసింది.
SIR, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు..
ఎన్నికల సంఘం ఓట్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఢిల్లీలో జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. నవంబర్ 01న ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
Also Read
- Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
- Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
- Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
- Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..
-
కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!