Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రై సిరీస్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత.. ఐపీఎల్ స్టార్లతో కూడిన ఇండియా ‘ఎ’ జట్టు బుధవారం దాంబుల్లాలో ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో తలపడనుంది. టోర్నీలో నిలవాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం శ్రీలంక ‘ఎ’ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్, ఆఫ్ఘనిస్తాన్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే.. మెరుగైన నెట్ రన్ రేట్ (+0.032) వల్ల భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే భారత్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. గత మ్యాచ్‌లో భారత్ 349 పరుగులు చేసినప్పటికీ, వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వైభవ్ సూర్యవంశీ వివాదం..
గత మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’తో జరిగిన సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్ మధ్య మైదానంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కొనసాగించలేకపోయిన సూర్యవంశీ (14, 44, 21 పరుగులు) ఈ మ్యాచ్‌లో రాణించాల్సి ఉంది.
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
కీలక ఆటగాళ్లు..
భారత జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 204 పరుగులు చేశాడు. కెప్టెన్ తిలక్ వర్మ (149 పరుగులు) కూడా రెండు అర్ధసెంచరీలతో రాణించాడు. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని చెరో 4 వికెట్లు తీశారు. గాయపడిన ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ సింగ్ స్థానంలో అశోక్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఈ కీలక పోరు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుష్ బదోని, కుమార్ కుశాగ్ర, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అనుకూల్ రాయ్, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, అర్షద్ ఖాన్, అశోక్ శర్మ, విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!