హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.
ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు పడుతున్నట్లు పాట్లు అన్నీ ఇన్నీ కావు. మూడు రోజులుగా విమానాశ్రయాల్లోనే ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అటు తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు పరిచయం చేసుకున్నారు.
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగిపోయాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై రూ.270 పెరగగా.. సిల్వర్ ధర మాత్రం దిగొచ్చింది. ఏకంగా రూ.4,000 తగ్గింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 5న నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.
పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.
బాబోయ్.. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు రోజులుగా విమాన సర్వీసులు లేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటు ఇంటికి వెళ్లలేక.. అటు ప్రయాణం లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నాక ఒకే కారులో ప్రయాణం చేశారు.