అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్‌కు బయల్దేరారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ బయల్దేరే సమయంలో మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తోంది. ఓ వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఇక చేసేదేమీలేక కారులోంచి కిందకు దిగి గొడుగుతో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
బీహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ టీవీకే అధినేత, నటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం ధర్మాసనం కీలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం వేళ ఒక ఇజ్రాయెలీయుడు విషాదకరమైన నిర్ణయానికి తీసుకున్నాడు. ఇటీవలే రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. ప్రస్తుతం శాంతి ఒప్పందం జరిగింది. ఇలాంటి తరుణంలో ఒక ప్రియుడు మరణశాసనాన్ని రాస్తున్నాడు.
కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించకపోవడం వల్ల తన ఆదాయం తగ్గిందని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లి ఆదాయాన్ని చక్కదిద్దుకుంటానని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని.. ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు డోనాల్డ్ ట్రంప్ బొటనవేలు పైకి చూపిస్తూ విజయ సంకేతం ఇచ్చారు.
ఎట్టకేలకు గాజాలో శాంతి పరిమళాలు వెదజల్లబోతున్నాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది.