యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు
పాకిస్థాన్ ప్రస్తుతం ఉగ్ర ముప్పును ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, ఆప్ఘనిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పాకిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది.
ఆప్ఘనిస్థాన్ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా మచాడోతో మాట్లాడినట్లు నివేదికలు అందుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేనస్సీ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. 19 మంది చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రుల మార్పిడి ఆట సాగుతోంది. ఎప్పుడు.. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారారంటే ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందో ఈపాటికే అర్థమైంటుంది.
గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది.