మావోయిస్ట్ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలిలో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ముఖ్యమంత్రికి ఒక్కొక్కరిగా వచ్చి ఆయుధాలు అందజేశారు.
మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వెనిజులా తీరంలో మరోసారి అమెరికా దాడి చేసింది. తీరంలో వేగంగా దూసుకెళ్తున్న నౌకపై అమెరికా దళాలు దాడులు చేయడంతో ఆరుగురు నార్కో ఉగ్రవాదులు మరణించారని ట్రంప్ తెలిపారు. గత కొద్దిరోజులుగా వెనిజులా తీరంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న నౌకలపై అమెరికా దాడులు చేస్తోంది.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది, దివంగత చార్లీ కిర్క్ 32వ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ట్రంప్ అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌కు మెడల్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆద్యంతం ఎరికా కిర్క్ దు:ఖపడుతూనే ఉన్నారు. ట్రంప్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ వ్యూహకర్త ఆష్లై టెల్లిస్(64) అరెస్ట్ అయ్యారు. జాతీయ రక్షణ సమాచారాన్ని చట్ట విరుద్ధంగా భద్రపరిచినందుకు అభియోగాలు మోపబడ్డాయి. సమాఖ్య దర్యాప్తు తర్వాత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బీహార్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈజిప్టు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-మాక్రాన్ మధ్య ‘ఆర్మ్ రెజ్లింగ్’ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో ఉండగా హాస్యనటుడు రాజు తలికోటే(59) హఠాన్మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాజు తాలికోటే ప్రాణాలు కోల్పోయారు.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌కు న్యాయం జరగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చండీగఢ్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు.