బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలను దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
బీహార్‌లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగబోతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి తహతహలాడుతున్నాయి.
బాబోయ్ చైనాలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైళ్ల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. 36 లైన్లు కలిగిన చైనాలోని వుజువాంగ్ టోల్ స్టేషన్ దగ్గర కార్లు క్యూ కట్టాయి. వేలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.
ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
మహిళలకు కర్ణాటక ప్రభుత్వం దీపావళి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నెలలో ఒకరోజు రుతుక్రమ సెలవును ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వర్తిస్తుందని పేర్కొంది.
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు.
ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్‌లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం విచారణ జరుగుతున్న సమయంలో ఒక వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71) షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని బయటకు తీసుకుని పోయారు.
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కొద్దిరోజులుగా ఒడుదుడుకులకు గురవుతోంది. ఓ వైపు ట్రంప్ వాణిజ్యం.. ఇంకోవైపు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో సతమతం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్ గాడిలోపడింది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిసింది.