అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్‌కు బయల్దేరారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ బయల్దేరే సమయంలో మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తోంది. ఓ వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఇక చేసేదేమీలేక కారులోంచి కిందకు దిగి గొడుగుతో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఈదురుగాలులకు గొడుగు ఊగిపోయింది. అలా ఇబ్బంది పడుతూనే ట్రంప్ విమానం ఎక్కారు. అనంతరం దాన్ని మూసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో సిబ్బంది గొడుగు తీసుకుని మడత పెట్టి లోపలికి లాక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Israel: బందీల విడుదల వేళ ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్
ట్రంప్ గొడుగులతో ఇబ్బంది పడడడం ఇదే మొదటిసారి కాదు. 2018 అక్టోబర్‌లో వర్షం పడుతున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు గొడుగు మూసేందుకు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏప్రిల్ 2025లో మార్-ఎ-లాగోకు బయలుదేరడానికి విమానం ఎక్కుతున్న సమయంలో గొడుగుతో తంటాలు పడ్డారు. అనంతరం సిబ్బందికి అప్పగించారు.
ఇది కూడా చదవండి: Big Shock: బీహార్ ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. ఐఆర్‌సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. సోమవారం తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. థ్యాంక్యూ ట్రంప్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. భారీ ఎత్తున హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఇక సోమవారం ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబాలను కలవనున్నారు. అక్కడ నుంచి ఈజిప్టుకు వెళ్లి శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
Beta Trump can’t close his own umbrella.
Embarrassing day for our nation. pic.twitter.com/cIWGuvTFxu
— Keith Edwards (@keithedwards) October 12, 2025