గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్‌ను బైడెన్ అభినందించారు.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా 738 రోజులు హమాస్ చెరలో బందీలుగా ఉండిపోయారు. తిరిగి వస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ట్రంప్ ప్రోదల్బంతో గాజా-ఇజ్రాయెల్‌లో శాంతి వాతావరణం నెలకొంది.
తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా? అని మెలోనిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులంతా హాజరయ్యారు. ట్రంప్ ప్రసంగించిన తర్వాత మాట్లాడాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు.
బీహార్‌లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.