బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎంత నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
దీపావళి అంటేనే గుర్తొచ్చేది విద్యుత్ దీపాలు.. కొత్త బట్టలు.. రకరకాలైన స్వీట్లు. సందడి.. సందడి వాతావరణం. ఇంటిల్లిపాది టపాసులు కాల్చడం.. ఇలా దీపావళికి ఎన్నెన్నో కొత్త సంగతులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. రకరకాలైన పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ.
బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.
దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్ కాస్తా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌కు వేదికలాగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్స్ బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన పార్టీలు పట్టించుకోని సమస్యలను ప్రశాంత్ కిషోర్ లేవనెత్తారని.. అయితే ఆ సమస్య పరిష్కారానికి చాలా సమయం పడుతుందని తెలిపారు.
పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలును ఆపడానికి ఒక ప్రయాణీకుడు గొలుసు లాగాడు. దీంతో ట్రైన్ ఆగడంతో వెంటనే ప్రయాణికులంతా కోచ్ నుంచి సురక్షితంగా బయటకు దిగేశారు. ఈ క్రమంలో పలువురి ప్రయాణికులకు స్వల్పగాయాలు అయినట్లు అధికారి తెలిపారు.
రివాబా జడేజా.. నిన్నామొన్నటిదాకా అంతగా ఫేమస్ కానీ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా ముఖ పరిచయం కానీ.. పేరు అంతగా గుర్తింపు పొందలేదు. కానీ తాజాగా ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది.