Gold Sweets: జైపూర్‌లో ఆకట్టుకుంటున్న బంగారం స్వీట్స్.. ధరెంతో తెలుసా!
- జైపూర్‌లో ఆకట్టుకుంటున్న బంగారం స్వీట్స్
- ధరెంతో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి అంటేనే గుర్తొచ్చేది విద్యుత్ దీపాలు.. కొత్త బట్టలు.. రకరకాలైన స్వీట్లు. సందడి.. సందడి వాతావరణం. ఇంటిల్లిపాది టపాసులు కాల్చడం.. ఇలా దీపావళికి ఎన్నెన్నో కొత్త సంగతులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. రకరకాలైన పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అందులో స్వీట్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. స్వీట్స్ బాక్సులను గిఫ్ట్‌లుగా కూడా ఇస్తుంటారు. దీంతో దీపావళి సమయంలో స్వీట్స్ షాపులకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే అన్ని స్వీట్స్ షాపుల్లో అమ్మినట్టుగా అమ్మితే స్పెషల్ ఏమంటుందని అనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ జైపూర్‌లో ఒక స్వీట్‌మేకర్ మాత్రం బంగారం స్వీట్లు విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు దాని స్పెషల్ ఏంటి? దాని ఖరీదు ఎంతో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Delhis Railway Station: రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
జైపూర్‌లోని ఒక స్వీట్‌మేకర్ బంగారంతో కలిపిన స్వీట్స్‌ను విక్రయిస్తున్నాడు. ‘‘స్వర్ణ భస్మ’’ లేదా స్వర్ణ ప్రసాదం పేరుతో పిలువబడే ఈ స్వీట్స్‌ను తినదగిన రీతిలో తయారు చేస్తుంటారు. 24 క్యారెట్ల తినదగిన బంగారం, కుంకుమ పువ్వు, బాదం, ఆయుర్వేద పదార్థాలతో ఈ స్వీట్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ స్వీట్స్‌లో ఆరోగ్యాన్ని మిళితం చేసే పదార్థాలే ఉంటాయి. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్స్‌గా పేరుగాంచింది. ప్రస్తుతం కిలో స్వీట్స్ రూ.1.11 లక్షల ధర పలుకుతుంది.
ఇది కూడా చదవండి: Rivaba Jadeja: ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్వీట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లకు నోరూరుతోంది. అద్భుతమైన ప్రసాదం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ స్వీట్లు దక్కించుకోవాలంటే మాత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాల్సిందే. ఇక ఇందుకు సంబంధించిన గోల్డ్ స్వీట్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.
BIG 🚨 A Jaipur Sweetmaker is selling a gold-infused sweet 😳
It is made with ‘Swarn Bhasma’, or edible gold ash.
The sweet is priced at ₹1 lakh per kilo.
— Times Algebra (@TimesAlgebraIND) October 18, 2025
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..