అస్సాంలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.
రెండు వారాల్లో పుతిన్‌ను కలుస్తానని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌ను కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి ఒక విద్యాకుసుమం రాలిపోయింది. కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా దుండగుడు కత్తితో తెగబడడంతో తీవ్ర రక్తస్రావమై విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు వదిలింది. శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘతుకం జరిగింది.
ఢిల్లీ యూనివర్సిటీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూస్తుండగానే ఒక ప్రొఫెసర్‌పై విద్యార్థిని దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని.. ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది.
కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్‌లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు.
ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఆర్మీ.. పాకిస్థాన్ నడ్డి విరిచింది. అనంతరం దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. తాజాగా పాకిస్థాన్ 1971 నాటి ఐకానిక్ లొంగుబాటు చిత్రాన్ని భారత్ సైన్యం ట్రోల్ చేసింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా జేడీయూ కూడా తుది జాబితాను విడుదల చేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌పై షూతో దాడికి యత్నం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71)పై నేరపూరిత ధిక్కార చర్యలకు ఏజీ ఆమోదం తెలిపింది.