ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది. గత నెలలో నవీ ముంబైలో కారును ట్రక్కు డ్రైవర్ ఢీకొట్టాడని కిడ్నాప్ తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు తనిఖీలు చేయగా పూణెలోని పూజా ఖేద్కర్ నివాసంలో కారు దొరికింది.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్టోబర్ 24న బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
తమిళనాడు వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీళ్లు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బీహార్‌లో ఎన్నికల సమరం నడుస్తోంది. రెండు విడతల్లో జరుగుతున్న పోలింగ్‌కి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 143 మందితో కూడిన అభ్యర్థులను జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది.
దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఓ వైపు సముద్రం.. ఇంకోవైపు భారతమాత సైనికుల బలం తనతో ఉందని ప్రధాని మోడీ అన్నారు. గోవాలోని కార్వార్ తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర సాయుధ దళాల సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గుర్తుగా ఈ ఏడాది దీపావళి వేడుకలు నౌకాదళంతో జరుపుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం ఉదయం ఒక్కసారిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలోని మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా (Very Poor) నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 417గా రికార్డైంది.
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా మెరుపులు మెరిసిన బంగారం ధరలు దీపావళి రోజున కాస్త ఉపశమనం కలిగించింది. గోల్డ్, సిల్వర్ ధరలు నెమ్మదించాయి. తులం బంగారం ధరపై రూ. 170 తగ్గింది. సిల్వర్ ధర మాత్రం యధాస్థితిలో కొనసాగుతోంది.
భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
స్టాక్ మార్కెట్‌కు దీపావళి జోష్ కనిపిస్తోంది. సోమవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. కొద్ది రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్.. ఈ వారం ప్రారంభం మాత్రం దివాళి మెరుపులు కనిపిస్తున్నాయి.