త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుందని మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు తనకు హామీ ఇచ్చారని.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు తీవ్ర అవుతున్నాయి. పాకిస్థాన్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర నష్టం జరుగుతోంది. తాజా దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా, పరూన్‌గా గుర్తించారు. మరో ఐదుగురు స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
దీపావళి పండుగకు మందు గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం కేబినెట్ విస్తరణ అట్టహాసంగా జరిగింది. 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా.. రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక సమాచారాన్ని అందించింది. జుబీన్ గార్గ్ మరణం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు కనిపించలేదని.. దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ కోసం ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా వేడుకలు జరుపుకుంటారు. ఇక బీహార్‌లో అయితే ఎన్నికల పండుగ కూడా జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల మావో అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ సారధ్యంలో పలువురు మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు.
ట్రంప్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ కాంగ్రస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఖండించారు. రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే చతురత లేదని ఆమె విమర్శించారు. ట్రంప్‌కు మోడీ భయపడరని.. అమెరికాతో భారత దౌత్యం వ్యూహాత్మకమైందని రాసుకొచ్చారు.
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లు మారడం లేదు. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా బెంగళూరులో కళాశాల క్యాంపస్‌లోనే పట్టపగలు విద్యార్థినిపై స్నేహితుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.