దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం ఉదయం ఒక్కసారిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో ఢిల్లీ వాసులు మళ్లీ బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలోని మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో 24 చోట్ల గాలి నాణ్యత చాలా దారుణంగా (Very Poor) నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 417గా రికార్డైంది.
ఇది కూడా చదవండి: Gold Rates: దీపావళి రోజున గోల్డ్ లవర్స్‌కు స్వల్ప ఊరట.. నేడు ధరలు ఇలా..!
రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ హెచ్చరించాయి. సాయంత్రానికి పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో స్టేజ్ -2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచాలని, సమగ్ర ఎన్‌సీఆర్ వాయు నాణ్యత విధానం కింద అన్ని కాలుష్య తగ్గింపు లక్ష్యాలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తారు. స్టేజ్-1 (పేలవమైనది AQI 201–300), స్టేజ్-2 (చాలా పేలవమైనది 301–400), స్టేజ్-3 (తీవ్రమైనది 401–450), స్టేజ్-4 (తీవ్రమైనది ప్లస్, 450 కంటే ఎక్కువ)గా గుర్తిస్తారు. ప్రస్తుతం ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 417గా నమోదైంది. దీంతో పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా మారిపోయాయి.
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
వైద్యుల అభిప్రాయం ప్రకారం… శీతాకాలంలో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారడానికి ప్రతికూల వాతావరణం. వాహనాల ఉద్గారాలు, పంటలు కాల్చడం, బాణసంచా కాల్చడం, స్థానిక కాలుష్య వనరులు కారణం అవుతుంటాయి. ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని.. రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని.. అంతేకాకుండాగుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.
సోమవారం దీపావళి. ఈరోజు భారీగా టపాసులు పేలుస్తారు. గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వాతావరణం పొలుష్యన్ కారణంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం ఉంది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సమయ పాలన పాటించాలని మాత్రం విజ్ఞప్తి చేసింది.