ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది. గత నెలలో నవీ ముంబైలో కారును ట్రక్కు డ్రైవర్ ఢీకొట్టాడని కిడ్నాప్ తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు తనిఖీలు చేయగా పూణెలోని పూజా ఖేద్కర్ నివాసంలో కారు దొరికింది. అనంతరం డ్రైవర్‌ను విడిచిపెట్టమని అడిగితే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ పోలీసులపై కుక్కలను ఉసిగొల్పింది. పోలీసులు లోపలికి దూకి డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించారు. అనంతరం స్టేషన్‌కు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి పూజా తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఊరట లభించింది. పూజా తల్లిదండ్రులు దిలీప్ ఖేద్కర్, మనోరమకు బెయిల్ మంజూరు అయింది.
ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin: వారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు.. దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
పోలీసులు కావాలనే తమను లక్ష్యంగా చేసుకున్నారని దిలీప్ ఖేద్కర్ ఆరోపించారు. దర్యా్ప్తులో పోలీసులకు సహకరిస్తున్నామని.. అయినప్పటికీ తమపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఎటువంటి నేరం చేయలేదని.. కాబట్టి ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. పైగా ఈ కేసులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Diwali 2025: టపాకాయలు కాల్చడంలో గాయాలయ్యాయా..? ఇంటి వద్దే సురక్షిత చికిత్స ఇలా చేసుకోండి.!
పూజా ఖేద్కర్ కుటుంబం అనేక వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నారు. 2024లో పూజా ఖేద్కర్ యూపీఎస్సీలో అక్రమాలకు పాల్పడినందుకు వేటుకు గురయ్యారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. భవిష్యత్‌లో కూడా ఎలాంటి యూపీఎస్సీ పరీక్షల్లో కూడా పాల్గొనకుండా నిషేధం విధించింది. ఇక పొలంలో ఒక రైతును తుపాకీతో బెదిరించడంతో తల్లి మనోరమ జైలు పాలయ్యారు. అంతేకాకుండా తండ్రి దిలీప్ కూడా అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అదే డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసినట్లుగా విమర్శలు వచ్చాయి.