మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకేనని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరులో ఘోరం జరిగింది. 21 ఏళ్లకే ఓ విద్యార్థినికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కాలేజీకి వెళ్లి తిరిగి రావాల్సిన ఓ స్టూడెంట్ను బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. ఓ నిండు ప్రాణం బస్సు చక్రాల కింద నలిగిపోయింది.
సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాట మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ (Vijay) ఎట్టకేలకు శుక్రవారం కొత్త పార్టీని స్థాపించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో నూతన పార్టీని నెలకొల్పారు.
దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం దగ్గర నుంచీ కూరగాయలు.. గ్యాస్.. పెట్రోల్ ఇలా ప్రతిదీ కొనలేని పరిస్థితి. సామాన్యుల దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబాల వారు ఈ ధరలతో అల్లాడిపోతున్నారు
ఝార్ఖండ్ సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది.
పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రారంభమైన రెండ్రోజులు సాఫీగా సాగినా శుక్రవారం మాత్రం హాట్ హాట్‌గా నడిచాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమైంది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.
గురువారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని తేల్చిచెప్పారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిన జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రం
ఝార్ఖండ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఇంకా గవర్నర్ ఆహ్వానించలేదు