Maoist Party: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శి వికల్ప్ పేరుతో మరో సంచలన లేఖ విడుదల చేసింది. ఇటీవల పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. హిడ్మా ఆచూకీ గురించి దేవ్‌జీ పోలీసులకు చెప్పి ఉంటారనే వార్తలు పార్టీ ఖండించింది. “దేవ్ జీతో పాటు మళ్ళా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు.. లొంగిపోవటానికి వారు ఎలాంటి ఒప్పందము కుదుర్చుకోలేదు.. హిడ్మా సమాచారాన్ని దేవ్ జీ పోలీసులకు చెప్పాడు అనేది పూర్తిగా అవాస్తవం.. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం.. అడవి నుంచి బయటికి వచ్చిన కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణం.. విజయవాడకు చెందిన కలప వ్యాపారితోపాటు ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ కారకులు.. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్ళాడు.. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారు.. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లు కట్టు కథ అల్లారు.. హిడ్మా హత్య ఒక ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది.. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నాం..” అని లేఖలో పేర్కొన్నారు.