దేశం పేరు మార్చాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా మళ్లీ లోక్‌సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు.
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది.
ట్రాన్స్జెండర్లకు (Transgenders) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుభవార్త చెప్పారు. దేశ రాజధానిలో ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని (Free Bus ) కల్పిస్తూ కేజ్రీవాల్ ప్రకటన చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోడీ (PM Modi) తిప్పి్కొట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోడీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదని తేల్చి చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానమిచ్చారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్‌తో భేటీ అయింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.
పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.