Dry Fruits for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ నాలుగు డ్రై ప్రూట్స్ ట్రై చేయండి..
- బరువు తగ్గడానికి సహాయపడే 4 ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్
- బాదం, ఆక్రోట్ , వేరుశనగలు, ఖర్జూరం
- డ్రై ప్రూట్స్ లో ఉన్న ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి.
Also Read
అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా పాలన్ వెల్లడించారు.. ఇవి బరువు తగ్గడంలోనే కాదు, మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్నారు. అయితే… నిపుణులు సూచించిన 4 డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం:
బరువు తగ్గడానికి సహాయపడే 4 ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్
1. బాదం:
బాదంలో ఎక్కువగా మెగ్నిషియం, విటమిన్ ఈ, కాపర్, కాల్షియం, ప్లాంట్ ప్రోటీన్ అధికంగా ఉంటాయని న్యూట్రిషిన్స్ చెబుతున్నారు. బాదంలో ఉన్న ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తాయి.జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ బాదం తీసుకునే వారి బరువు, డ్రై ఫ్రూట్స్ ఎట్టి రకంగా తీసుకోని వారితో పోలిస్తే మరింత తగ్గినట్లు గుర్తించారు. ప్రతిరోజూ 4–5బాదం తీసుకోవాలని డైట్‌షియన్ ప్రియా పాలన్ సూచిస్తున్నారు.
2. ఆక్రోట్ (Walnuts)
ఆక్రోట్‌లో అధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.ఇవి శరీరంలోని వాపు తగ్గించడం,
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.కేలరీలు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ, నియంత్రిత పరిమాణంలో తీసుకుంటే ఇవి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయన్నారు. ఆక్రోట్ తినే వారికి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి.. ఓవర్‌ఈటింగ్‌ను తగ్గిస్తుంది.
3. వేరుశెనగలు (Peanuts)
వేరుశెనగలను “పేదల బాదం” అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు.ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించి ఆకలిని తగ్గిస్తాయి. న్యూట్రిషన్ జర్నల్ లోని ఒక పరిశోధన ప్రకారం, భోజనానికి ముందు 35 గ్రాముల వేరుశెనగలు తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుందని సర్వే తేల్చి చెప్పింది.
4. ఖర్జూరం (Dates)
ఖర్జూరంలో సహజ చక్కెర,ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఖర్జూరం యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెరుగైన మెటబాలిక్ ఆరోగ్యం కోసం ప్రయోజనకరంగా ఉంటుందని న్యూట్రిషియన్లు పేర్కొన్నారు. అదనంగా, ఖర్జూరం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటంతో మిఠాయిలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చుంటున్నారు.
అయితే ఈ సమాచారం మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే న్యూట్రిషియన్ సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!