మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ముసల్గావ్ సిన్నార్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఆదిమా ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది ఉద్యోగులు పనిలో ఉన్నారు. అదృష్టవశాత్తు ఫ్యాక్టరీలోని కార్మికులకు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. మంటలు ఎగిసిపడడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగినట్లు సమాచారం. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Maharashtra | Fire broke out in a factory in the industrial area of Sinnar, Nashik. Fire tenders are present at the spot.
(Source: Police) pic.twitter.com/8PxUBP4wIF
— ANI (@ANI) February 2, 2024