కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. వయసురీత్యా ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో రాజ్యసభకు పోటీ చేయనున్నారు.
అయితే ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఆయా రాష్ట్రాల నుంచి అభ్యర్థునలు వచ్చాయి. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. అయితే ఏ రాష్ట్రం నుంచి ఆమె పోటీ చేస్తారనేది క్లారిటీ రాలేదు. మంగళవారం సాయంత్రం దీనికి ఒక క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న రాహుల్‌గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే… సోనిమా పేరు ప్రకటించనున్నారు. ఏ రాష్ట్రం నుంచి అనేది మరికొద్దిసేపట్లో తెలిసిపోనుంది.
సోనియా హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా కూడా ఆ రాష్ట్రం నుంచే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ ఊహగానాలకు తెరపడనుంది. సోనియా బుధవారమే రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు.
ఇదిలా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. రాయ్‌బరేలీ అనేది కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. దీంతో ప్రియాంక పోటీ చేస్తే ఈజీగా విజయం సాధించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తు్న్నాయి. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో ఉత్కంఠకు తెరపడనుంది.
Sonia Gandhi is all set for Rajya Sabha this time. She will file her nomination tomorrow, Rahul Gandhi and Congress president Mallikarjun Kharge to accompany her. Final decision on the state where she will contest from will be taken by tonight: Sources
(File photo) pic.twitter.com/FxsBUKmm9J
— ANI (@ANI) February 13, 2024
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi arrives at Delhi airport. pic.twitter.com/Tvgsfalf8Z
— ANI (@ANI) February 13, 2024