అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘంటనలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పదవిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి గుండె ఆపరేషన్ జరిగింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. గురువారం చెన్నై అపోలో డాక్టర్లు కుమారస్వామికి నాన్-సర్జికల్ వైద్యం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన నివాసానికి అధికారులు చేరుకుని కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఆప్ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు కూడా సీఎం ఇంటికి చేరుకుంటున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ ఆరోగ్యంపై నిత్యానంద స్వామి స్పందించారు. త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.