Indra Nooyi: అమెరికాలో భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘంటనలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా దుండగుల చేతిలో విద్యార్థులు బలైపోతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని అమెరికాకు పంపిస్తుంటే.. కన్న తల్లిదండ్రులకు మాత్రం దు:ఖం కలిగిస్తున్నారు. ఇటీవలే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ ప్రాణాలు కోల్పోగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. ఈ స్టూడెంట్ ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ.. భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు, అదృశ్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నానని.. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని.. చట్టానికి లోబడి ఉండాలని తెలిపారు. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని… దయచేసి అతిగా మద్యం సేవించొద్దని కోరారు. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలని… కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ఇంద్రానూయీ సూచించారు.
ఇది కూడా చదవండి: Tillu Square Censor: టిల్లన్న హడావుడి చూసి ఏదో అనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి?
భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలు అని ఆమె గుర్తుచేశారు. అదే సమయంలో కొందరు డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని.. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయని తెలిపారు. అలాగే మీ వీసా స్టేటస్ గురించి తెలుసుకోవాలని సూచించారు. అలాగే పార్ట్‌టైం ఉద్యోగం విషయంలో కూడా దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా విద్యాసంస్థల పట్ల కూడా అవగాహనతో ఉండాలని, స్కామ్‌లు, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై సురేష్ రైనా కీలక ప్రకటన!
తాజాగా అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి సలీం తెలిపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.
For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg
— India in New York (@IndiainNewYork) March 22, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!