బ్రిటన్‌లో తాజాగా జరిగిన ఎన్నికల సర్వేలో అధికార ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 400కు పైగా సీట్లు సాధించాలని కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. తీహార్ జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించాలి రౌస్ అవెన్యూ కోర్టు జైలు అధికారులను మరోసారి ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.