ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సైనిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశం చుట్టూ ఉన్న అస్థిర భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు.
బుధవారం కిమ్ యుూనివర్సిటీ ఆఫ్ మిలిటరీని సందర్శించారు. 2011లో కిమ్ తన తండ్రి పేరుతో నిర్మించారు. దేశంలో సైనిక విద్యలో అత్యున్నత స్థానంలో ఉంది. ఉత్తర కొరియా ఇటీవల కాలంలో ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేసింది. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉందని కిమ్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇక రష్యాతో కూడా సన్నిహిత సంబంధాలను మెరుగుపరుకుంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు సహాయం చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. అయితే ఇది ద్రవ ఇంధనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది
ఇది కూడా చదవండి: MI vs RCB: నా జీవితంలోనే ఎప్పుడూ పుస్తకం చదవలేదు.. కానీ ఇప్పుడు తప్పలేదు: సూర్యకుమార్