సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు కర్ణాటక లోకయుక్త నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలని తాజాగా డీకే శివకుమార్‌ను లోకాయుక్త కోరింది. గతంలో ఈ కేసును సీబీఐ విచారించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వం మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడ్డాక.. దానిని ఉపసహరించింది. దీంతో ఈ కేసు ఈ ఏడాది ప్రారంభంలో లోకాయుక్తకు బదిలీ చేయబడింది. గతంలో సీబీఐకి సమర్పించిన ప్రతాలను తమకు కూడా అందజేయాలని తాజాగా డీకే.శివకుమార్‌కు పంపిన నోటీసులో వెల్లడించింది. ఆదాయానికి మించి రూ.74.93 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని డీకే శివకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Bajaj Pulsar N250 : బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి వచ్చేసిన కొత్త పల్సర్ బైక్.. ఫీచర్స్ అదుర్స్..
తాను ఎలాంటి తప్పు చేయలేదని డీకే.శివకుమార్ చెప్పారు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ కేసు విచారణ నుంచి సీబీఐను సిద్ధరామయ్య ప్రభుత్వం తప్పించడంపై హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు వెలువడ లేదు. తాజాగా లోకాయుక్త నోటీసులు పంపించింది.
ఇది కూడా చదవండి: PM Modi: చైనాతో సంబంధాలపై మోడీ కీలక వ్యాఖ్యలు