ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వ్యక్తిగత వైద్యుడ్ని నియమించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వారానికి మూడు సార్లు వైద్యులు పరీక్షించేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. ఈడీ కస్టడీలో ఉన్న తొలి రోజుల్లోనే కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన చక్కెర స్థాయి పడిపోయింది. ప్రస్తుతం కూడా షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా వ్యక్తిగత వైడ్యుడ్ని సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. తొలిరోజుల్లో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ 46 ఎంజీ/డీఎల్‌కు పడిపోయిందని కేజ్రీవాల్ లాయర్ కోర్టుకు తెలిపారు .
ఇది కూడా చదవండి: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కేజ్రీవాల్ తాజా పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని ఈడీ కోరింది. జైల్లో కూడా కేజ్రీవాల్ వైద్య సదుపాయాలు పొందవచ్చని ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది గుర్తుచేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపురి విచారణ ఏప్రిల్ 18కు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Sriramanavami 2024 : ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంను వెన్నెలలోనే ఎందుకు జరిపిస్తారో తెలుసా?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. దీంతో మరిన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. కానీ ప్రచారం చేసేందుకు మాత్రం ఆయనకు అవకాశం లేకుండా పోయింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా