AAP: స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల.. సీఎం సతీమణికి చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. పార్టీలో అయోమయం నెలకొంది. ప్రచారం ఎవరు నిర్వహిస్తారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆ అనుమానాలను పటాపంచల్ చేస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆప్ విడుదల చేసింది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లను వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Actor Died: ఇండస్ట్రీకి షాక్.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
ఈ జాబితాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, రాఘవ్ చద్దా, మంత్రి అతిషి, ఇసుదన్ గాధ్వి తదితరులు జాబితాలో ఉన్నారు. అనూహ్యంగా రాఘవ్ చద్దా పేరు కూడా ఉండడం విశేషం. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాఘవ్ చద్దా ఎక్కడా? కనిపించలేదు. దీంతో ఆయన కూడా అరెస్ట్ భయంతో పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. కానీ అనూహ్యంగా ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. దీంతో మరిన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. కానీ ప్రచారం చేసేందుకు మాత్రం ఆయనకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేరు వెల్లడించారు. మరీ ఆయన ప్రచారం ఎలా నిర్వహిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Yarlagadda VenkatRao: సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు