జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా అంశం మళ్లీ రగడ సృష్టిస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర వివాదం మొదలైంది. రాష్ట్ర హోదా విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మనోజ్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర హోదాను సాకుగా చూపొద్దని.. ఎన్నికైన ప్రభుత్వానికి అవసరమైన అన్ని అధికారాలు ఉన్నాయని.. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కూడా కౌంటర్ ఎటాక్ చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? ఓటర్ల మైండ్ సెట్ ఈసారి ఎలా ఉండబోతుంది?
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘‘మా పనేంటో మాకు తెలుసు. లెఫ్టినెంట్ గవర్నర్ తన మీద దృష్టి పెట్టాలి. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇదంతా అతని పర్యవేక్షణలోనే జరిగింది. తిరిగి మా పనేదో చూసుకోమంటూ సలహా ఇస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారు. రాష్ట్ర హోదా అంశాన్ని తాను ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా తాను గతంలో ఆరు సంవత్సరాలు పనిచేసిన కాలంలో ఎప్పుడూ కూడా ఒక పర్యాటకుడికి కూడా హానీ జరగలేదన్నారు. ‘‘నేను భద్రతకు బాధ్యత వహిస్తే’’.. పహల్గామ్ లాంటి సంఘటన ఎన్నటికీ జరిగి ఉండేది కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: with my old friend..! 393 అంబాసిడర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు..
రాష్ట్ర హోదా అంశాన్ని తాను ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటానని.. సుప్రీంకోర్టు, పార్లమెంటులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర హోదా వాగ్దానంపైనే ప్రజలు నమ్మకంతో అధికారం ఇచ్చారని.. ఆ వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీశారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సరైన సమయం ఏమిటో కేంద్రం వివరించాలని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘‘మీరు దానిని ఎలా కొలుస్తారు? రాష్ట్ర హోదాకు తగిన సమయాన్ని మీరు ఏ స్థాయిలో తూస్తారు? ముఖ్యమంత్రిగా నేను కనీసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోసం నిర్దేశించిన లక్ష్యం లేదా లక్ష్యాన్ని తెలుసుకోవాలి.’’ అని ముఖ్యమంత్రి అడిగారు. గత ఆరు సంవత్సరాల కేంద్ర పాలనలో అభివృద్ధి రంగంలో లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా విఫలమయ్యారని ముఖ్యమంత్రి ఆరోపించారు.