సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీపై యూటర్న్ తీసుకున్నారు. పంజాబ్‌లోని బటిండా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
ముంబైలో దారుణం జరిగింది. రూ.200 చికెన్ బిల్లుపై ఘర్షణ చోటుచేసుకోగా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ప్యూన్ (30) హత్యకు గురయ్యాడు. మరొకరు గాయాలు పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భాగల్పూర్లో ట్రక్కు టైర్ పేలి.. కారుపై బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమాపూర్ గ్రామ సమీపంలోని 80వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
కేరళలో దారుణం జరిగింది. కన్నూర్‌లోని పున్నచ్చేరిలో అర్ధరాత్రి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున క్యాంపస్‌ల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో విద్యార్థులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) సోమవారం కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికిలో చకిత్స పొందుతూ మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. మరీ ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ హెచ్చరించారు.
జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు జేఎంఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.