సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీపై యూటర్న్ తీసుకున్నారు. పంజాబ్‌లోని బటిండా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం తర్వాత పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెల్పాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా సోమవారం సాయంత్రం అధికారిక పార్టీ అభ్యర్థి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూతో కలిసి బల్కౌర్ సింగ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం ఆయన పోటీపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే అమెరికా మీడియా కథనంపై భారత్ ఆగ్రహం
తొలుత బంటిడా నుంచి బల్కౌర్ సింగ్‌ను పోటీ చేయమని కాంగ్రెస్ కోరింది. కానీ ఆయన నిరాకరించారు. తన కుమారుడు సిద్ధూ మూసేవాల్‌కు న్యాయం చేయాలని కోరారు. పార్టీ తరపున పార్లమెంట్‌లో గళం విప్పేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో బల్కౌర్ పోటీ నుంచి తప్పుకున్నారు. న్యాయం జరగకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని బల్కౌర్ సింగ్ ఆరోపించారు.బటిండా నుంచి శిరోమణి అకాలీదళ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గుర్మీత్ సింగ్, కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సిద్ధూ బరిలో ఉన్నారు. బటిండా లోక్‌సభ స్థానానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: TS SSC Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా..
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్ గర్భం దాల్చింది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: Operation Chirutha: 2వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. ఇంకా లభించని ఆచూకీ