గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు ప్రత్యేకం కావడమే కారణం.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గత కొన్ని రోజులుగా ఇండియాలో కనిపించడంలేదు. పైగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. దీంతో ఆయనపై రకరకాలైన పుకార్లు వ్యాప్తి చెందాయి.
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి షాక్ ఇచ్చారు.
ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ హింజిలి అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పట్నాయక్ కాంటాబంజీ, హింజిలి అసెంబ్లీ స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది.
సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యంతరకర వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జేడీఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.
హైదరాబాద్‌లో గేమింగ్ స్థావరంపై మాదాపూర్ ఎస్ఓటీ బృందం దాడులు చేసింది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై మాదాపూర్ పోలీసులు మెరుపుదాడి చేశారు.