అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎట్టకేలకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించింది. సోమవారం ఆమె.. మంత్రి అతిషితో కలిసి తీహార్ జైలుకు వెళ్లారు. ఇద్దరు కలిసి సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. రాఘవ్ చద్దాను పరారీలో ఉన్న విజయ్ మాల్యాతో పోల్చుతూ పంజాబ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్లో ఓ కథనం వెలువడింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలే దాడి చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకురాలి తలకు గాయమై రక్తస్రావం అవుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
సందేశ్‌ఖాలీ దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.
కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికిలో చకిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.
అమెరికా యూనివర్సిటీల్లో తాజాగా మరో కలవరం చోటుచేసుకుంది. గత వారం పాలస్తీనా అనుకూల నిరసనలతో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తీవ్ర కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులు అమెరికా జెండా స్థానంలో పాలస్తీనా జెండాను ఎగురవేశారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వైద్యులు సోమవారం తెలిపారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.