వెంకీ కుడుముల పేరు చెప్తే ‘ఛలో’, ‘భీష్మ’, ‘రాబిన్‌హుడ్’ వంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తన కెరీర్లో మరో కొత్త అడుగు వేయడానికి రెడీ అయ్యారు. ఈసారి ఆయన ఏకంగా నిర్మాతగా మారిపోయి, వాట్ నెక్స్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ని మొదలుపెట్టారు. ఈ బ్యానర్‌పై వెంకీ కుడుముల ఒక కొత్త యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ను నేడు అధికారికంగా రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ఆయన దర్శకుడిగా కాకుండా, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచింది.
ఈ కొత్త సినిమాలో ఒక కొత్త హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనెవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్గా అనస్వర రాజన్ నటిస్తుండగా, ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్‌కి తన పూర్తి సపోర్ట్‌ను ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ-అనౌన్స్మెంట్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ కొత్త కాంబినేషన్ లో రాబోయే సినిమా టైటిల్ ఏమై ఉంటుందో అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.