సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యంతరకర వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జేడీఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అధికారికంగా పార్టీ కోర్ కమిటీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Rashmika Deep Fake Video : రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఢిల్లీ పోలీసులు
ఈ ఘటన 5-6 ఏళ్ల క్రితం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజ్వల్ నివాసంలో పని చేస్తున్న మహిళ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇన్నేళ్లుగా ఎందుకు ఫిర్యాదు చేయలేదని.. ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చిందని కుమార స్వామి ప్రశ్నించారు. ఏది ఏమైనా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేశామని.. సిట్ దర్యాప్తు తర్వాత నిందితుడని తేలితే మాత్రం పూర్తిగా పార్టీ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీని వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయినా వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలన్నారు.
ఇది కూడా చదవండి: Komatireddy Raj Gopal Reddy: అప్పుడు నన్ను చూసే ఓటువేశారు.. బీజేపీని చూసి కాదు..