ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ హింజిలి అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పట్నాయక్ కాంటాబంజీ, హింజిలి అసెంబ్లీ స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేడీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగల్‌గా బరిలోకి దిగుతోంది.
ఇది కూడా చదవండి: Uttarpradesh : విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ భాజాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి
నవీన్ పట్నాయక్.. ఐదు పర్యాయాలుగా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోసారి విజయం కోసం బీజేడీ రంగంలోకి దిగింది. తమదే విజయమని బీజేడీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ బీజేపీ-బీజేడీ పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ పొత్తు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా అధికారంపై కన్నేసింది. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
#WATCH | Ganjam: Odisha CM and BJD president Naveen Patnaik files his nomination papers from the Hinjili Assembly seat
CM Patnaik is contesting the Assembly elections from Kantabanji and Hinjili Assembly seats. The Assembly elections will be held in Odisha in four phases from… pic.twitter.com/GC3Nblof2g
— ANI (@ANI) April 30, 2024