కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్లో చోటుచేసుకుంది.
కువైట్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు.. నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మొత్తానికి రెండ్రోజుల ఒడుదుడుకులకు ఫుల్ స్టాప్ పడింది. బుధవారం స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగాయి
కువైట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 43 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ పక్షాలకు ఆయా శాఖలు దక్కాయి. ఇక బీజేపీ కేంద్రమంత్రులకు పాత శాఖలే దక్కాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు.
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లంట్లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు.
ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఉంటుంది. ఆయా కంపెనీలు ప్రతీ నెల జమ చేస్తుంటాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కొంత డబ్బు తీసుకునే వెసులబాటును ఈపీఎఫ్వో కల్పించింది. ఒకప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి.
యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది తప్పిపోయారు. ఈ మేరకు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తెలిపింది.
ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులకు మరో లక్కీ ఛాన్స్ దక్కనుంది. లోక్సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది.