నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు భారీ ఘన స్వాగతం లభించింది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే శనివారం ఆమె ఢిల్లీ వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న షేక్ హసీనాకు.. అధికారులు ఘనస్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Mansion House : వావ్.. గ్రీన్ యాపిల్ ఫ్లేవర్‌లో మాన్షన్ హౌస్
విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్, భూటాన్ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi : రామోజీరావు మరణంతో తెలుగుజాతి పెద్దదిక్కును కోల్పోయింది..
ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీ20 సమావేశాల తరహాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల పాటు ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధించారు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Abhishek Sharma: సునామి సృష్టించిన అభిషేక్ శర్మ.. 25 బంతుల్లో మెరుపు సెంచరీ..