ఆదివారం మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటి వరకు ఆహ్వానించలేదు. కాంగ్రెస్‌కు కానీ.. ఇండియా కూటమి నేతలకు గానీ ఇప్పటి వరకు ఆహ్వానాలు పంపలేదు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీయులను ఆహ్వానించారు కానీ.. విపక్షాలను మాత్రం ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేసీ.వేణుగోపాల్ కూడా తెలియజేశారు.
ఆదివారం సాయంత్రం 7:15 నిమిషాలకు మోడీ.. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే ఎన్డీఏ నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాయ్‌బరేలీకే వైపే రాహుల్ గాంధీ.. వయనాడ్‌ని వదిలిపెట్టే అవకాశం..
తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. దీంతో ముచ్చటగా మూడోసారి మోడీ.. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక బీజేపీకి సొంతంగా 240 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది.