CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రశంసించారు. తమ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత రాష్ట్రానికి గర్వకారణమని వారు అభినందించారు. పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బాబురావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు ఎస్పీ కావాలని సూచించారు. ఈ సందర్భంగా బాబురావు తన స్వగ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సీఎంను కోరగా, ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. అలాగే, బలభద్రపురం గ్రామానికి చెందిన మణికంఠ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. మణికంఠ బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడని వివరించారు.
గుంటూరు అర్బన్ ప్రాంతానికి చెందిన కాశింశెట్టి అఖిల్ గోపీచంద్ చిన్నతనం నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివాడని సీఎం తెలిపారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అఖిల్ తన లక్ష్యాన్ని సాధించడంలో పట్టుదల చూపాడని ప్రశంసించారు. యువత ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్న మహిళా కానిస్టేబుల్ కొమ్ము శిరీష తన అనుభవాలను పంచుకున్నారు.
Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం
అన్నమయ్య జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి తాను వచ్చానని, ఆడపిల్లలను చదివించవద్దని చాలామంది చెప్పినా, తన తండ్రి మాత్రం ఆడబిడ్డలు–మగబిడ్డలు అన్న తేడా లేకుండా సమానంగా చూసేవారని చెప్పారు. తన సోదరి బిహార్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతోందని, తనను కూడా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివించారని శిరీష వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలను అసాధారణ పట్టుదలతో చదివించిన తల్లిదండ్రులు నిజంగా అభినందనీయులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటువంటి తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!