దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే కమిటీ దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలు సేకరించి ఒక నివేదికను తయారు చేసింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసి నివేదిక అందజేసింది. అయితే త్వరలోనే నివేదిక కేంద్ర క్యాబినెట్ ముందుకురానుంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ సంసిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..
100 రోజుల అజెండాలో భాగంగా దీన్ని సాధ్యమైనంత తొందరగా క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలిపాయి. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి వంద రోజుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలని లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ అన్ని శాఖలకు సూచించారు. దీనికి అనుగుణంగానే న్యాయశాఖలోని శాసన విభాగం రెడీ అవుతోంది.
జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ.. ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అందులో సిఫార్సు చేసింది. వీటితోపాటు మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటరు కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది. మరోవైపు ఇదే అంశంపై అటు న్యాయశాఖ కూడా త్వరలోనే తన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Health Tips : పెరుగును వీటితో కలిపి అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?