Viral video: విహార యాత్రలో విషాదం.. కారు లోయలోపడి యువతి మృతి
- విహార యాత్రలో విషాదం
- కారు లోయలోపడి యువతి మృతి
- మహారాష్ట్ర శూలీభంజన్ కొండపై ఘటన
- మొబైల్‌లో రికార్డ్ అయిన దృశ్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహితుడితో కలిసి ఆ యువతి విహార యాత్రకు వెళ్లింది. టూరిస్టు స్థలాలను మిత్రుడితో కలిసి సందర్శించింది. ఎంతో సంతోషంగా గడిపింది. మనసులో ఏం పుట్టిందో ఏమో.. కారు నడిపే అలవాటు ఉందో లేదో తెలియదు గానీ.. డ్రైవింగ్ సీటులో కూర్చుని వెనక్కి డ్రైవ్ చేస్తోంది. ఇంకోవైపు మిత్రుడు మొబైల్‌లో రికార్డ్ చేస్తు్న్నాడు. అంతే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు గానీ.. అమాంతంగా కారు లోయలో పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. స్పాట్‌లోనే యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోపి శూలీభంజన్ కొండపై ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read

శూలీభంజన్ కొండపై 23 ఏళ్ల శ్వేత దీపక్ అనే యువతి.. కారు రివర్స్ చేస్తుండగా వాహనంతో సహా 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం ఔరంగాబాద్ నుంచి శూలీభంజన్ కొండకు శ్వేత.. ఆమె మిత్రుడు సూరజ్ విహార యాత్రకు వెళ్లినట్టు పోలీసులు చెప్పారు. శ్వేత కారును రివర్స్ చేస్తుండగా.. సూరజ్ వీడియో రికార్డు చేస్తున్నాడని తెలిపారు. కారు వేగంగా వెనక్కి వెళ్తుండడాన్ని గమనించిన మిత్రుడు.. వెంటనే పరుగున వెళ్లి క్లచ్‌పై కాలు వేయమని శ్వేతకు సూచించాడు. కానీ అంతలోనే కారు వేగంగా దూసుకెళ్లి లోయలోపడిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: International Yoga Day 2024: శ్రీనగర్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..
సందర్శకులు శూలీభంజన్ కొండ దర్శనానికి వస్తుంటారు. పర్యాటకులు దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వర్షాకాలంలో శూలీభంజన్ కొండపై సుందరమైన దృశ్యాలు ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని ఆస్వాదించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి సందడిగా ఉంటుంది. టూరిస్టుల కళ్ల ముందే కారు బోల్తా పడిపోయింది. యువతిని హెచ్చరించినా.. కంగారులో ఏమీ చేయలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Reels-jeevi loses life while backing up a car when she did not know how to drive. Probably mashed the a-pedal instead of the brake.
Etios is a nice sturdy car, it looks mashed beyond recognition in the pics .. would not have been a quick, painless death 😔pic.twitter.com/7RCjQAa1ts— BigSlowThirsty (@SlowThirsty) June 18, 2024
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!