Punjab: శివసేన నాయకుడిపై కత్తులతో దాడి.. పట్టించుకోని జనాలు
- శివసేన నాయకుడిపై కత్తులతో దాడి
- పట్టించుకోని జనాలు.. పంజాబ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే శివసేన నాయకుడిపై దాడులకు తెగబడ్డారు. చుట్టూ జనం ఉన్నా.. ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!

సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శుక్రవారం లూథియానాలో రద్దీగా ఉండే వీధి మధ్యలో పంజాబ్ శివసేన నాయకుడు సందీప్ థాపర్‌పై కత్తులతో దాడి చేశారు. భద్రత కోసం సందీప్ థాపర్‌తో పాటు వచ్చిన ఒక పోలీసు కూడా అడ్డుకోలేదు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
థాపర్ ఒక ట్రస్ట్ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి వస్తున్నారని, సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలపై కోపంతో ‘నిహాంగ్‌లు’ అతనిపై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని లూథియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ తేజా తెలిపారు.
పంజాబ్‌లోని ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వంపై శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ విరుచుకుపడ్డారు. ఈ సంఘటన శాంతి భద్రతల పతనాన్ని సూచిస్తోందని అన్నారు. సీఎం భగవంత్‌మాన్ నిద్ర నుంచి మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
BREAKING : Sandeep Thapar kin of Shaheed Sukhdev singh was attacked by 3 assailants ( Nihang) in Ludhiana town. Sandeep Thapar belongs to Hindustan shiv Sena. pic.twitter.com/nEEmrKZUhc
— Baba Banaras™ (@RealBababanaras) July 5, 2024
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!