Delhi: ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ.. గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు
- ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ
- గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ గుండెలో నుంచి పెద్ద నిమ్మకాయంత కణితి తొలగించి విజయం సాధించారు. పేషెంట్ పూర్తి ఆరోగ్యం పొందుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ సర్జరీ అరుదైనదిగా ఆస్పత్రి పేర్కొంది.
రాఖీ (27) అనే మహిళ కార్డియాక్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, సుదీర్ఘమైన తిమ్మిరితో బాధపడుతోంది. దీంతో ఆమె ఇటీవల పట్పర్‌గంజ్‌లోని మాక్స్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెకు టెస్టులు నిర్వహించగా.. హార్ట్‌లో పెద్ద నిమ్మకాయంత కిణితి కనిపించింది. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న వైద్యులు.. ఆపరేషన్ నిర్వహించగా.. సక్సెస్‌గా గుండెలో ఉన్న కణితిని తొలగించారు. ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో వైద్యులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇది కూడా చదవండి: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీటీవీఎస్ కార్డియాక్ సర్జరీ డైరెక్టర్, హెడ్ డాక్టర్ వైభవ్ మిశ్రా మాట్లాడుతూ.. మహిళ గుండెలోని సుమారు పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉన్న కణితిని గుర్తించి.. విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. కణితిలో ఒక భాగం విడిపోయి మెదడుకు ప్రయాణించి.. ఫలితంగా స్ట్రోక్ వస్తోందని మిశ్రా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అడ్డంకిని తొలగించినట్లు చెప్పారు. ఓపెన్-హార్ట్ సర్జరీకి బదులు.. డాక్టర్ మిశ్రా నేతృత్వంలోని బృందం కనిష్ట ఇన్వాసివ్ ‘స్కార్‌లెస్’ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. పక్కటెముకలు కత్తిరించకుండా కుడి ఛాతీలో 5 సెంటీమీటర్ల చిన్న కోత చేసి సర్జరీ చేసినట్లు వెల్లడించారు.
శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ రాఖీ ఆస్పత్రిలో కోలుకుంది. నాల్గవ రోజు డిశ్చార్జ్ అయింది. ఇది వైద్య బృందానికి, రోగికి అద్భుతమైన విజయంగా ఆస్పత్రి పేర్కొంది.
ఇది కూడా చదవండి: Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
తాజావార్తలు
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!